
పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్లు ఏడాదికి ఒక్క సినిమా షూటింగ్ తో మాత్రమే సరిపెడుతుంటే, పాన్ ఇండియా స్టార్ అన్న ట్యాగ్ లైన్ సృష్టించిన ప్రభాస్ మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాల షుటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు.
అటు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగుల్లో పాల్గొంటూ ఇటు మారుతి దర్శకత్వంలోని రాజా డీలక్స్ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు ప్రభాస్.
తాజాగా హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్, మరో పదిరోజులు రాజ డీలక్స్ షుటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. హైదరాబాద్ లోని స్టుడియోలో వేసిన సెట్ లో రాజా డీలక్స్ షూటింగ్ జరుగుతుందని సమాచారం.
సినిమాలోని కీలక సన్నివేశాలను 10రోజులు చిత్రీకరిస్తారట.
ప్రభాస్
సైలెంట్ గా తెరకెక్కుతోన్న సినిమా
ఐతే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అధికారికంగా కనీస సమాచారాన్ని కూడా బయటపెట్టలేదు. అప్పుడప్పుడు షూటింగ్ సెట్ లోంచి రిలీజ్ అయ్యే ఫోటోలు తప్ప ఇంకే సమాచారమూ అధికారికంగా బయటకు రాలేదు.
సినిమా చిత్రీకరణ పూర్తిగా ముగిసిన తర్వాతే, ఈ సినిమా గురించి బయటకు చెప్పాలని చిత్రబృందం భావిస్తుందని అంటున్నారు.
ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారని వినికిడి. మరో హీరోయిన్ కి తీసుకునే అవకాశం ఉందని వినిపించినప్పటికీ ఎవరిని తీసుకుంటున్నారనే దానిపై క్లారిటీ లేదు.
అలాగే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకుంటున్నారనే విషయాన్ని కూడా ఇంతవరకూ వెల్లడి చేయలేదు. 2024వేసవిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.