Page Loader
Prabhas : ప్రభాస్‌ కొత్త మేకోవర్‌.. నెగటివ్‌ షేడ్‌ రోల్‌ కోసం గ్రీన్‌ సిగ్నల్‌?
ప్రభాస్‌ కొత్త మేకోవర్‌.. నెగటివ్‌ షేడ్‌ రోల్‌ కోసం గ్రీన్‌ సిగ్నల్‌?

Prabhas : ప్రభాస్‌ కొత్త మేకోవర్‌.. నెగటివ్‌ షేడ్‌ రోల్‌ కోసం గ్రీన్‌ సిగ్నల్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండస్ట్రీలో 'డార్లింగ్‌'గా పేరు తెచ్చుకున్న రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా 'కన్నప్ప' సినిమాలో అతని పాత్ర మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. సాధారణంగా స్టైలిష్‌ హీరోలుక్‌లో కనిపించే ప్రభాస్, ఓసారి మాస్ లుక్‌తో, యాంటీ-హీరో షేడ్‌తో తెరపై దర్శనమిస్తే ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. 'బాహుబలి'గా ఒక విభిన్న మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్, ఇప్పుడు విలన్‌ షేడ్‌లోనూ అదే స్థాయిలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే 'సలార్‌లో గ్రే షేడ్‌ క్యారెక్టర్‌ ద్వారా ఆడియెన్స్‌కు షాక్ ఇచ్చిన ప్రభాస్‌.. ఇప్పుడు పూర్తి స్థాయి యాంటీ-హీరో పాత్ర కోసం ఒక అడుగు ముందుకు వేయనున్నాడట.

Details

ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం

తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఓ బాలీవుడ్‌ దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. దర్శకుడి పేరు ఇంకా బయటకు రాకపోయినా.. కేవలం ఒక్క సమావేశంలోనే కథ విన్న ప్రభాస్ వెంటనే ఓకే చెప్పేశాడట. ఇందులో ప్రభాస్ పాత్ర పూర్తిగా మాస్ యాంటీ-హీరో గానే ఉండనుందని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాను ఒక ప్రముఖ బాలీవుడ్‌ బ్యానర్‌ నిర్మించనున్నదిగా సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌ లుక్‌, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ అభిమానులకు గూస్‌బంప్స్‌ ఇచ్చేలా ఉంటాయని చెబుతున్నారు.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రభాస్‌ స్టార్‌డమ్‌ను పూర్తిగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్‌ 'రాజాసాబ్', హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అలాంటిది.. ఈ కొత్త బాలీవుడ్‌ యాంటీ-హీరో మూవీకి ఎప్పుడు డేట్స్‌ కేటాయిస్తాడోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఒకసారి డార్లింగ్ మాస్ యాంటీ-హీరోగా తెరపైకి వచ్చేసిన తర్వాత.. అది ఓ డిఫరెంట్ ఎరుపు చాపలా ఉండటం ఖాయం!