LOADING...
Prabhas : "ఒరే నాయనా.. అది ప్రభాస్ కాదు రా..ఆ ఫోటో నాదే!"-వైరల్ పిక్‌పై నటుడు క్లారిటీ
ప్రభాస్ వైరల్ లుక్ పై నటుడు కామెంట్స్

Prabhas : "ఒరే నాయనా.. అది ప్రభాస్ కాదు రా..ఆ ఫోటో నాదే!"-వైరల్ పిక్‌పై నటుడు క్లారిటీ

వ్రాసిన వారు Moogati Shabari
Mar 12, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సోషల్ మీడియాలో "ప్రభాస్ స్పిరిట్ లుక్" అంటూ ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫోటోలో వ్యక్తి ముఖం కనిపించకుండా వెనకవైపు నుంచి తీసినట్లు ఉంది. వెనుక నుంచి చూసినప్పుడు అది ప్రభాస్ ఫోటోనే అనిపించేలా ఉంది. ఎత్తులో కొంత తేడా ఉన్నప్పటికీ బ్యాక్ లుక్ మాత్రం ప్రభాస్‌ను గుర్తు చేసేలా ఉండటంతో చాలా మంది నెటిజన్లు ఆ ఫోటోను "ప్రభాస్ స్పిరిట్ లుక్" అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. అయితే ఆ ఫోటోపై తాజాగా ఒక నటుడు స్పందించాడు.

వివరాలు

ప్రభాసా..క్యారెక్టర్ ఆర్టిస్టా..?

అది ప్రభాస్‌ది కాదని, తన ఫోటోనే అని వెల్లడించాడు. వరుడు కావలెను, పుష్ప, RRR, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శివ గణేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవల తాను నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ సమయంలో వెనుకవైపు నుంచి తీసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోను చూసిన కొందరు అది ప్రభాస్ ఫోటో అని భావించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

వివరాలు

'ఆ ఫోటో నాదే..ప్రభాస్‌ది కాదు'

ఈ విషయంపై శివ గణేష్ స్పందిస్తూ... "అది నేను ఇటీవల ఒక సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫోటో. ఎలా అది ప్రభాస్ ఫోటోగా మారి వైరల్ అయిందో నాకు తెలియదు. వెనుక నుంచి చూస్తే కొంతవరకు లుక్స్ ప్రభాస్‌లా ఉన్నాయని కొందరు అంటున్నారు. నా స్నేహితులు కూడా 'ఇది ప్రభాస్ ఫోటో' అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్లు నాకు పంపించారు. కానీ ఆ ఫోటో మాత్రం నాదే, ప్రభాస్‌ది కాదు" అని స్పష్టం చేశాడు.

Advertisement