Kalki Movie: కల్కీ నుంచి ప్రభాస్ పిక్ లీక్.. నష్టపరిహారం చెల్లించాలని మేకర్స్ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కీ 2898 AD' మూవీలో నటిస్తున్నాడు.
కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన తర్వాత గ్లోబల్ వైడ్ గా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
ముందు నుంచి మేకర్స్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అవేంజర్స్ తరహాలో రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ప్రభాస్ న్యూ లుక్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది.
కాగా ఆ ఫోటో ఈ సినిమాకు పనిచేస్తున్న ఓ VFX కంపెనీ నుండి లీక్ అయినట్లు తెలుస్తోంది.
Details
VFX కంపెనీపై పోలీస్ కంప్లైట్ ఇచ్చిన మూవీ మేకర్స్
VFX వర్క్స్ పలు దేశాల్లోని టాప్ గ్రాఫిక్ కంపెనీల్లో జరుగుతున్నాయి.
ఈ విషయంపై కల్కి మేకర్స్ సీరియస్ అయ్యారు. దీనిపై VFX కంపెనీ పై పోలీస్ కంప్లైట్ ఇచ్చారు.
ఈ ఫోటోని లీక్ చేసేందుకు ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేసినట్లు ఫిలీం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్స్ యాక్టర్స్ నటిస్తున్నారు.