Rebal Star : ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ .. ఉగాది కానుకగా అనౌన్స్‌మెంట్?
ఈ వార్తాకథనం ఏంటి
'బాహుబలి' తర్వాత ప్రభాస్ లైన్‌అప్ చూస్తే, ఎప్పుడు ఎవరితో ఏ జానర్‌లో సినిమా చేస్తాడో ఊహించలేం.
'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' ఇలా ఒక్కోసారి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
విజయాలు, పరాజయాలు పక్కన పెడితే, ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన వారంతా ఒకటి రెండు సినిమాలు చేసిన యువ దర్శకులే.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్', హను రాఘవపూడితో 'ఫౌజీ' చేస్తున్నాడు. అలాగే 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' కూడా లైన్‌లో ఉన్నాయి.
ఇప్పుడు మరొక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.
Details
పోస్టర్ షూట్ పూర్తి
తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'హనుమాన్' పాన్-ఇండియా హిట్‌గా నిలిచింది.
ఇక ప్రశాంత్ వర్మ, ప్రభాస్‌ను కలిసి కథ వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రభాస్.
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇటీవల ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా చేసేశాడు. అలాగే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో కోసం 'హనుమాన్' స్టూడియోలో మూడు రోజుల పాటు షూటింగ్ జరిగింది. అందులో రెండ్రోజుల పాటు ప్రభాస్‌పై షూట్ చేశారు.
పోస్టర్ కోసం ప్రత్యేక ఫోటోషూట్, వీడియో షూట్ కూడా పూర్తయింది. ఉగాది కానుకగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల చేసే అవకాశం ఉంది.