LOADING...
The Rajasaab: ప్రభాస్‌ 'రాజాసాబ్‌' ఎఫెక్ట్‌.. మొసలి బొమ్మలతో థియేటర్లకు క్యూ కట్టిన ఫ్యాన్స్‌!
ప్రభాస్‌ 'రాజాసాబ్‌' ఎఫెక్ట్‌.. మొసలి బొమ్మలతో థియేటర్లకు క్యూ కట్టిన ఫ్యాన్స్‌!

The Rajasaab: ప్రభాస్‌ 'రాజాసాబ్‌' ఎఫెక్ట్‌.. మొసలి బొమ్మలతో థియేటర్లకు క్యూ కట్టిన ఫ్యాన్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం 'ది రాజాసాబ్‌' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తోంది. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచే ఇందులోని మొసలి సన్నివేశాలు సోషల్‌ మీడియాలో మీమ్స్‌గా విపరీతంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్‌ అయిన రోజున ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. చిత్రం విడుదల సందర్భంగా కొందరు అభిమానులు ఏకంగా మొసలి బొమ్మలను థియేటర్లకు తీసుకెళ్లి హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రభాస్‌ మొసలితో ఫైట్‌ చేసే సన్నివేశం స్క్రీన్‌పై వస్తున్న సమయంలో, అభిమానులు ఆ బొమ్మలతో స్క్రీన్‌ దగ్గరకు వెళ్లి ఆ సీన్‌ను రీక్రియేట్‌ చేస్తూ సందడి చేశారు. ఈఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతూ వైరల్‌గా మారాయి.

Details

వీడియోలపై మిశ్రమ స్పందన

అయితే ఈ వీడియోలపై మిశ్రమ స్పందన కూడా కనిపిస్తోంది. కొందరు ఇవి ఏఐ సాయంతో రూపొందించిన వీడియోలు అంటూ కామెంట్స్‌ పెడుతుండగా, మరికొందరు మాత్రం థియేటర్లలో జరిగిన అసలైన హడావుడేనని అంటున్నారు. ఏదేమైనా సినిమా విడుదల సందర్భంగా మొసలి అంశమే ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఇక నెటిజన్లు ఈ ట్రెండ్‌పై ఫన్నీ కామెంట్స్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. 'ఎవర్రా మీరంతా?', 'ఇది మొసళ్ల పండగ' అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్‌ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ, 'ది రాజాసాబ్‌' క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement