LOADING...
The Raja Saab : ప్రభాస్‌ 'రాజాసాబ్' ట్రైలర్‌ సర్‌ప్రైజ్‌.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌!
ప్రభాస్‌ 'రాజాసాబ్' ట్రైలర్‌ సర్‌ప్రైజ్‌.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌!

The Raja Saab : ప్రభాస్‌ 'రాజాసాబ్' ట్రైలర్‌ సర్‌ప్రైజ్‌.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీ 'ది రాజాసాబ్' కోసం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్‌పైనే ఉంది. ఫిలిం సర్కిల్స్‌ సమాచారం ప్రకారం, ఈ ట్రైలర్‌ను సర్‌ప్రైజ్‌గా సెప్టెంబర్‌ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక పవర్‌ఫుల్ పిక్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

Details

అభిమానుల్లో ఉత్కంఠ

దీంతో నిజంగానే ఈ స్పెషల్ ఫెస్టివల్ ట్రీట్‌ రాబోతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌ దత్‌ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటించబోతున్నారు. మ్యూజిక్‌ విభాగంలో థమన్‌ ఇప్పటికే అంచనాలు పెంచేశాడు. 'ది రాజాసాబ్'ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ దసరాకు ప్రభాస్ అభిమానులకు నిజంగానే గ్రాండ్ ట్రీట్ దక్కనుందా అన్నది చూడాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఇదే