Mathu Vadalara 2 Trailer : విడుదలైన 'మత్తు వదలరా 2' ట్రైలర్.. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్
2019లో విడుదలైన "మత్తు వదలరా" సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ కోడూరి హీరోగా పరిచయమయ్యాడు. తరువాత శ్రీసింహ పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు, "మత్తు వదలరా" సినిమా సీక్వెల్‌తో మరల ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నిర్మించబడుతుండగా, రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీసింహ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా, సత్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రమోషనల్ సాంగ్
ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్,పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తాజాగా "మత్తు వదలరా 2" ట్రైలర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తే శ్రీసింహ, సత్య తమ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ఈ సినిమా మొత్తం 2 గంటల 19 నిమిషాల నిడివితో రానుంది. ఇంకా, ఈ సినిమా ప్రమోషన్‌లు విభిన్నంగా నిర్వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో వీడియోలు రూపొందిస్తున్నారు. ప్రత్యేకంగా, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్వయంగా రాసి పాడిన ప్రమోషనల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.