Prabhas Spirit: 'స్పిరిట్'లో ప్రభాస్ షాకింగ్ లుక్.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్ రివీల్!
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందన్న విషయంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల ప్రభాస్ సన్నబడి, మీసకట్టుతో కనిపించిన లుక్ చూసి అభిమానులు ఇదే 'స్పిరిట్' ఫైనల్ లుక్ అని భావిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలు సర్ప్రైజ్ ఇంకా ముందే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒకే తరహా మేకోవర్‌కే పరిమితం కాకుండా, మరో క్రేజీ వేరియేషన్‌లో కూడా కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Details
పోలీస్ ఆఫీసర్ లుక్ లో ప్రభాస్
దీనికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు ఉన్న ఓ ప్రత్యేక అలవాటేనట. తాను సినిమా తీస్తున్నప్పుడు హీరో లుక్ ఎలా ఉంటుందో, దానికి దగ్గరగా తన స్టైల్‌ను కూడా ఆయన మెయింటైన్ చేస్తుంటారు. ఇది గతంలో 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల సమయంలో ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇటీవల సందీప్ రెడ్డి వంగ క్లీన్ షేవ్‌తో, కేవలం మీసాలతో కనిపించడంతో, ప్రభాస్ 'స్పిరిట్'లో సరికొత్త పోలీస్ ఆఫీసర్ లుక్‌లో దర్శనమివ్వడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ప్రభాస్ మరో మేకోవర్‌లోకి మారనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మ్యాడ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.