Loading...
Prabhas: ఒకేసారి మూడు మెగా ప్రాజెక్టులు.. మూడు విభిన్న అవతారాలు.. ప్రభాస్ ఫుల్ స్వింగ్!
ఒకేసారి మూడు మెగా ప్రాజెక్టులు.. మూడు విభిన్న అవతారాలు.. ప్రభాస్ ఫుల్ స్వింగ్!

Prabhas: ఒకేసారి మూడు మెగా ప్రాజెక్టులు.. మూడు విభిన్న అవతారాలు.. ప్రభాస్ ఫుల్ స్వింగ్!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో కెరీర్‌లో అత్యంత బిజీ దశను ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమాను పూర్తి చేయడానికే ఏడాది వరకు సమయం కేటాయిస్తున్న తరుణంలో, ప్రభాస్ మాత్రం ఏకకాలంలో మూడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్', నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న 'కల్కి 2', హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' చిత్రాల షూటింగ్‌లతో డార్లింగ్ షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.

వివరాలు

నిరంతర షూటింగ్‌లో కల్కి2..

బాలానగర్, చంచల్‌గూడ ప్రాంతాల్లో కీలక యాక్షన్ ఎపిసోడ్‌లను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2' కూడా ఈ నెల నుంచి నిరంతర షూటింగ్ షెడ్యూల్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లలో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.

భవిష్యత్ ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త తరహా లుక్‌తో పాటు పూర్తి భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

తుది దశకు చేరిన ఫౌజీ..

మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమా కూడా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

టాకీ పార్ట్ దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది.

ఇంకా సుమారు 25 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఈ మూడు సినిమాల ప్రత్యేకత ఏమిటంటే... ప్రతి చిత్రం పూర్తిగా భిన్నమైన నేపథ్యంతో రూపొందుతోంది.

'స్పిరిట్'లో తీవ్ర స్వభావం కలిగిన పోలీస్ అధికారి పాత్ర, 'కల్కి 2'లో భవిష్యత్ ప్రపంచానికి చెందిన యోధుడి పాత్ర, 'ఫౌజీ'లో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు.

ADVERTISEMENT