LOADING...
Spirit : అధికారిక పోస్టర్ రాకముందే ప్రభాస్ 'స్పిరిట్' లుక్ లీక్..?
అధికారిక పోస్టర్ రాకముందే ప్రభాస్ 'స్పిరిట్' లుక్ లీక్..?

Spirit : అధికారిక పోస్టర్ రాకముందే ప్రభాస్ 'స్పిరిట్' లుక్ లీక్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో పాటు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో నిర్వహించగా, మెగాస్టార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అయితే చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి ఫస్ట్‌లుక్ లేదా మోషన్ పోస్టర్‌ను విడుదల చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ హంగామా చెలరేగింది. పూజ కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే, ప్రభాస్ 'స్పిరిట్' లో కనిపించే లుక్ ఇదేనంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది.

Details

విపరీతంగా షేర్ చేస్తున్న అభిమానులు

పోలీస్ యూనిఫారంలో, షార్ట్ హెయిర్ స్టైల్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నట్టుగా కనిపించే ఆ ఫోటో నిజమో కాదో స్పష్టత లేకపోయినా, ప్రభాస్ అభిమానులు దాన్ని విపరీతంగా షేర్ చేయడం ప్రారంభించారు. ఫోటోలో కనిపించిన ప్రభాస్ కొత్త హెయిర్‌స్టైల్, ఇంటెన్స్ లుక్ చూసి చాలా మంది అది నిజమైన స్టిల్‌నేనని నమ్ముతూ వైరల్ అయ్యేలా చేశారు. కానీ ఆ ఫోటో అసలు ఫేక్ అని, ఒక హీరో ఫోటోకు ప్రభాస్ ముఖం జతచేసి ఎడిట్ చేసినదేనని వంగా టీమ్ సభ్యుల్లో ఒకరు ఇంటర్నల్‌గా క్లారిటీ ఇచ్చారు.

Details

స్పిరిట్'పై భారీ అంచనాలు 

సినిమా నుంచి ఏదైనా మెటీరియల్ విడుదల చేస్తే, అది అధికారికంగా చిత్రబృందమే ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను మాస్ యాక్షన్, ఎమోషన్, అత్యున్నత స్టైల్ మిశ్రమంగా తెరకెక్కించబోతున్నాడని సమాచారం. యానిమల్ తర్వాత వంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.