LOADING...
Spirit: స్పిరిట్ అప్‌డేట్: ప్రభాస్ మూడు పవర్‌ఫుల్ లుక్స్ లాక్!
Spirit: స్పిరిట్ అప్‌డేట్: ప్రభాస్ మూడు పవర్‌ఫుల్ లుక్స్ లాక్!

Spirit: స్పిరిట్ అప్‌డేట్: ప్రభాస్ మూడు పవర్‌ఫుల్ లుక్స్ లాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులే కావడంతో షూటింగ్ ఎప్పుడొస్తుందా అన్న ఆతృత అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లుక్ టెస్ట్ నిన్ననే ఆయన నివాసంలో జరిగినట్టు తెలుస్తోంది. సినిమా టీమ్ ఇప్పటికే మూడు బలమైన లుక్‌లను సిద్ధం చేసి ఫిక్స్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆ మూడు లుక్‌లన్నీ సినిమాలో కనిపిస్తాయా, లేక ఒక్క లుక్‌నే ఫైనలైజ్ చేసి వాడతారా అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

వివరాలు 

హీరోయిన్‌గా తృప్తి డిమ్రి 

మరోవైపు, స్పిరిట్ చిత్రంలోని హీరోయిన్ విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట దీపికా పదుకొణెను ఈ పాత్రకు పరిశీలించినప్పటికీ, ఆమెను ప్రాజెక్ట్‌ నుంచి తప్పించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే—చిత్రీకరణ త్వరలోనే మొదలవుతుందని ఆయన ఇటీవల తెలిపాడు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సూచనలు ఇచ్చాడు.

వివరాలు 

ప్రభాస్ లుక్ మెయింటెనెన్స్ ఎలా పాజిబుల్

ప్రభాస్ లుక్ ఫైనల్ కావడంతో, చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయినట్టే భావిస్తున్నారు. అయితే, ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో, ఈ లుక్ మెయింటెనెన్స్ ఎలా పాజిబుల్ అవుతుంది అనే చర్చ కూడా జరుగుతోంది.దీంతో ఈ అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది.