Prabhas: స్పిరిట్ మూవీ నుంచి ప్రకాశ్ రాజ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు పుకార్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నాడన్న ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నారనే వదంతులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గతంలో ప్రభాస్-ప్రకాశ్ రాజ్ మధ్య కీలక సన్నివేశాల షూటింగ్ కూడా ప్రారంభమైందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రకాశ్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వివరాలు
2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల
ఇక ముందుగా విడుదలైన వాయిస్ టీజర్ ఆధారంగా ప్రకాశ్ రాజ్ పాత్రకు సినిమాలో కీలక ప్రాధాన్యం ఉంటుందని అభిమానులు భావించారు. అలాంటి సమయంలో ఆయన తప్పుకున్నారనే వార్త నిజమైతే, సినిమా మీద ప్రభావం పడే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వదంతులపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీకి సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై నిర్మాణం జరుగుతోంది.