LOADING...
Thalapathy Vijay : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల తోపులాటలో కిందపడ్డ దళపతి విజయ్
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల తోపులాటలో కిందపడ్డ దళపతి విజయ్

Thalapathy Vijay : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల తోపులాటలో కిందపడ్డ దళపతి విజయ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అభిమానుల అత్యుత్సాహం రోజురోజుకీ పెరిగిపోతోంది.ఇటీవల టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ విషయంలో జరిగిన ఘటనలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు సమంత కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. అభిమానం పేరిట కొందరు ఫ్యాన్స్ నటీనటుల వ్యక్తిగత హద్దులను దాటి అసహజంగా ప్రవర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా చేరాడు.మలేషియాలో 'జననాయగన్' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం ముగించుకుని విజయ్ తమిళనాడుకు చేరుకున్నాడు. ఆయన రాకను చూసేందుకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ గుమికూడడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ జనసందోహం మధ్య విజయ్ తన కారువైపు వెళ్లే క్రమంలో అభిమానుల తోపులాటలో కాలుజారి కిందపడిపోయాడు.

వివరాలు 

అభిమానుల్లో ఆందోళన

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విజయ్‌ను చుట్టుముట్టి సురక్షితంగా అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ప్రస్తుతం విజయ్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఈ ఘటనకు సరైన స్థాయిలో క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమే ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో "తలపతి సేఫ్" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ట్రెండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విజయ్ భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఏదేమైనా అభిమానం హద్దుల్లో ఉంటేనే అందరికీ మేలు,అతి అభిమానం మాత్రం సమస్యలకే దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయ్ భద్రతపై ఆందోళన.. వైరల్ అయిన వీడియోలు

Advertisement