సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సలార్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సలార్ సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ టీజర్, ఎప్పుడు రిలీజ్ అవ్వనుందో క్లారిటీ వచ్చేసింది.
ఈ నెల చివర్లో లేదా జులై నెల మొదటి వారంలో సలార్ సినిమా టీజర్ రిలీజ్ కానుందని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ప్రచారం జోరుగా సాగుతోంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందుతున్న సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సలార్ టీజర్ పై సోషల్ మీడియాలో వార్తలు
#Salaar Teaser to likely release by this month End/First week of July 🔥
— AmuthaBharathi (@CinemaWithAB) June 19, 2023
One of the most expected movie in the combo of #Prabhas & #PrashanthNeel 🤞💥 pic.twitter.com/zMln1fB61K