LOADING...
Prabhas: ప్రభాస్ స్టైలే వేరు.. ముంబయి షూటింగ్‌.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్
ప్రభాస్ స్టైలే వేరు.. ముంబయి షూటింగ్‌.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్

Prabhas: ప్రభాస్ స్టైలే వేరు.. ముంబయి షూటింగ్‌.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కపుల్‌ ఫ్రెండ్లీ' సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్‌ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని హీరో ప్రభాస్ తెలిపారు. ముఖ్యంగా చివరి 20నిమిషాలు మరో స్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు. తాజాగా ఈ చిత్ర బృందం ప్రభాస్‌ను కలిసి మాట్లాడగా, ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విజయవాడ పునుగులు తనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. నేను అభిమానుల కోసం ఏడాదికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కానీ విడుదల మాత్రం ఒక్కటే అవుతోంది. నాకు 'గీతాంజలి' చాలా ఇష్టం. అందరూ నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టమనుకుంటారు. కానీ నాకు అన్ని జానర్‌లూ నచ్చుతాయి. ముఖ్యంగా నేను మణిరత్నం గారి అభిమానిని. 'కపుల్‌ ఫ్రెండ్లీ' చూసినప్పుడు నాకు 'గీతాంజలి'చూసిన ఫీల్‌ కలిగింది.

Details

పూరీ జగన్నాథ్ గొప్ప రైటర్

అందుకే ఈ సినిమాను నాలుగు సార్లు చూడాలని అనిపించిందని చెప్పారు. దర్శకుడు పురి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ 'పూరి జగన్నాథ్‌లా ఎవరూ రాయలేరు. ఆయన 'బుజ్జిగాడు' కథ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎలా చేస్తానో అని టెన్షన్‌ కూడా వచ్చింది. తర్వాత ఆయన దర్శకత్వంలో 'ఏక్‌ నిరంజన్‌' చేశాను. ఆయన డైలాగులు రాసే శైలి ప్రపంచంలోనే ప్రత్యేకం. నా సినిమాల్లో కాస్ట్యూమ్స్‌ కూడా భిన్నంగా ఉండేలా చూసుకుంటానని అన్నారు. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ప్రభాస్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Details

అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్

అందరికీ నా ఫుడ్‌ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నేను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫుడ్‌ ఆర్డర్‌ పెడతాను. 'ఆదిపురుష్‌' షూటింగ్ ముంబయిలో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టాను. టీమ్‌ అంతా షాక్‌ అయ్యారు. ఫ్లైట్‌లో ఆర్డర్‌ తీసుకొచ్చిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి 'మీరు మామూలు వాళ్లు కాదండీ' అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. మొత్తానికి సినిమాల ఎంపిక నుంచి వ్యక్తిగత అభిరుచుల వరకు ప్రభాస్‌ పంచుకున్న ఈ విషయాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement