LOADING...
Raja Saab: ఓవర్సీస్‌లో ప్రభాస్ 'ది రాజాసాబ్' హవా.. అడ్వాన్స్ బుకింగ్‌లతో అదిరిపోయే స్టార్ట్! 
ఓవర్సీస్‌లో ప్రభాస్ 'ది రాజాసాబ్' హవా.. అడ్వాన్స్ బుకింగ్‌లతో అదిరిపోయే స్టార్ట్!

Raja Saab: ఓవర్సీస్‌లో ప్రభాస్ 'ది రాజాసాబ్' హవా.. అడ్వాన్స్ బుకింగ్‌లతో అదిరిపోయే స్టార్ట్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'ది రాజాసాబ్' (The Raja Saab) ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనాలకు సంకేతాలు ఇస్తోంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఆశ్చర్యకర స్థాయిలో మొదలయ్యాయి. ప్రభాస్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్‌ను మరోసారి రుజువు చేస్తూ, ఉత్తర అమెరికాలో ఇప్పటికే 17,500కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు యూకే మార్కెట్‌లో కూడా 17,500కు మించిన ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషంగా మారింది.

Details

జనవరి 8న ప్రారంభమయ్యే ప్రీమియర్ షో

ఇంకా సినిమా విడుదలకు చాలా సమయం ఉండగానే ఇంత భారీ స్పందన రావడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా 2026జనవరి 8న ప్రారంభమయ్యే ప్రీమియర్ షోలకే ఈ స్థాయి బుకింగ్‌లు జరగడం, 'ది రాజాసాబ్' ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్ దిశగా దూసుకుపోతుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. సమాచారం ప్రకారం, దర్శకుడు మారుతి ఈ సినిమాను దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి రూపొందించారు. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదాత్మక అంశాలను సమపాళ్లలో మేళవించిన చిత్రంగా దీనిని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. 'బాహుబలి', 'సలార్' వంటి ఇంటెన్స్ పాత్రల తర్వాత ప్రభాస్‌ను ఒక లైట్ హార్ట్‌డ్, ఫుల్ ఎంటర్‌టైనర్‌లో చూడాలన్న అభిమానుల కోరికను 'ది రాజాసాబ్' నెరవేర్చబోతోందనే టాక్ వినిపిస్తోంది.

Details

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర

ప్రభాస్‌ను సరికొత్త కోణంలో చూపించడమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్‌లతోనే ఓవర్సీస్‌లో హీట్ పెంచుతున్న 'ది రాజాసాబ్', సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement