Prabhas: 'స్పిరిట్'లో ప్రభాస్ మూడు విభిన్న లుక్స్.. కొత్త లుక్స్‌పై సస్పెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'స్పిరిట్'.
ప్రభాస్ కెరీర్‌లో ఇది 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ అయింది.
సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తుండగా, టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్స్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించనున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.
డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్‌ను జనవరి నుంచి రెగ్యులర్‌గా మొదలుపెట్టి, ఆరు నెలల్లో పూర్తిచేసే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం.
Details
6 నెలల్లో షూటింగ్ పూర్తి
ఈ సినిమాలో ప్రభాస్ మూడు కొత్త లుక్స్‌లో కనిపించనుండడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల్లో హీరోల పాత్రలను ఎలా డిఫరెంట్‌గా చూపించారో, అదే విధంగా 'స్పిరిట్'లో కూడా ప్రభాస్‌ను కొత్తగా ఆవిష్కరించనున్నారు.
ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ చిత్రాలకు గ్లోబల్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల 'స్పిరిట్'పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు మునుపెన్నడూ చూడని విధమైన అనుభూతిని అందిస్తుందని దర్శకుడు హామీ ఇచ్చారు.