Page Loader
Rajasaab: 'రాజాసాబ్' టీజర్ తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ 

Rajasaab: 'రాజాసాబ్' టీజర్ తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు 'రాజాసాబ్'. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఈ తాజా చిత్రం టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. టీజర్ విడుదలైన క్షణం నుంచే యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్ మునుపటి రోజులను గుర్తు చేసేట్టుగా, హాస్యానికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండటంతో పాటు, ప్రభాస్ కామెడీ టైమింగ్ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తోంది.

వివరాలు 

రాజాసాబ్ టీజర్ ను క్రేజీగావాడుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ 

రొమాంటిక్ హారర్ కామెడీ, ఫ్యాంటసీ అంశాలతో రూపొందిన 'రాజాసాబ్' టీజర్ జూన్ 16న విడుదలైంది. ఈ టీజర్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు వెర్షన్‌కు ప్రత్యేక స్పందన లభించింది. ఇందులోని కొన్ని డైలాగులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిలో ముఖ్యంగా ''బండి కొంచెం మెల్లగా'', ''అసలే మన లైఫ్ అంతంతమాత్రం'' వంటి డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ డైలాగులను తీసుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక స్పెషల్ వీడియో రూపొందించడం విశేషం. సాధారణ ప్రజల్లో రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచేందుకు ఈ డైలాగులను వినూత్నంగా వాడారు.

వివరాలు 

బండి కొంచెం మెల్లగా

ట్రాఫిక్ నియమాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రభాస్ డైలాగులను సృజనాత్మకంగా వినియోగించింది. సాహో చిత్రంలోని ''ఇట్స్ షో టైమ్'' డైలాగుతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బైక్ మితిమీరిన వేగంతో ముందుకు వెళ్తుంది. అప్పుడే 'రాజాసాబ్' చిత్రంలోని ''హలో హలో బండి కొంచెం మెల్లగా'' అనే డైలాగ్ వినిపిస్తుంది. వెంటనే 'మిర్చి' సినిమాలో బైక్ పై నెమ్మదిగా ప్రయాణిస్తున్న ప్రభాస్ సీన్‌ని జోడించారు. ఆ తర్వాత ''అసలే మన లైఫ్ అంతంతమాత్రం'' అనే 'రాజాసాబ్' డైలాగ్ వస్తుంది. చివరగా మిర్చిలో ప్రభాస్ హెల్మెట్ తొలగిస్తున్న సన్నివేశాన్ని చూపిస్తూ ''హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి'' అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజలకు అందించారు.

వివరాలు 

డిసెంబర్ 5న థియేటర్లలో 'రాజాసాబ్' 

ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న 'రాజాసాబ్' చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా ముందే విడుదల కావాల్సి ఉండగా, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యం అయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎస్.ఎస్. తమన్ అందించారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ ట్రీట్ లా ఈ సినిమా ఉండబోతుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..