Page Loader
 Trailer: యాంకర్‌ ప్రదీప్‌, దీపిక జంటగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అ‍బ్బాయి'.. ట్రైలర్‌ విడుదల 

 Trailer: యాంకర్‌ ప్రదీప్‌, దీపిక జంటగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అ‍బ్బాయి'.. ట్రైలర్‌ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగులో కొన్ని సంవత్సరాలు ప్రముఖ యాంకర్‌గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు,గతంలో "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఆ చిత్రం విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు, యాంకరింగ్‌కి విరామం ఇచ్చి మరో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పేరు "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి". ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే, సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో ఓ పల్లెటూరికి వెళ్తాడు. ఆ ఊరిలో అతనికి ఎదురైన అనుభవాలు ఏమిటి? కథలో హీరోయిన్ పాత్ర ఎంత ముఖ్యమైనది? అనే అంశాలన్నీ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.

వివరాలు 

ప్రదీప్, ఈసారి హిట్ కొడతాడా?

హాస్యానికి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తున్న ట్రైలర్, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రదీప్‌కు జోడీగా దీపిక పిల్లి నటించగా, నితిన్-భరత్ ఈ సినిమాతో దర్శకులుగా పరిచయమవుతున్నారు. గతంలో హీరోగా విజయాన్ని అందుకోలేకపోయిన ప్రదీప్, ఈసారి హిట్ కొడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది!