LOADING...
SKN : ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్
ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్

SKN : ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా దీపావళి బ్లాస్టర్ 'డ్యూడ్' భారీ హిట్టుగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. అక్టోబర్ 17న విడుదలైన 'డ్యూడ్' హౌస్‌ఫుల్ కలెక్షన్లతో అద్భుతమైన స్పందన అందించడంతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ విజయాన్ని జరుపుకుంటూ మేకర్స్ 'డ్యూడ్ బ్లాక్‌బస్టర్ 100 cr జర్నీ' ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, మైత్రి మూవీ మేకర్స్‌కు ప్రతీ నెలా ఒక బ్లాక్‌బస్టర్ వస్తూనే ఉంటుంది.

Details

హీరోయిన్ గా ఎన్నో విజయాలు సాధించాలి

ఈ దీపావళికి విడుదలైన 'డ్యూడ్' ఒక పాన్ సౌత్ బ్లాక్‌బస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. నవీన్ గారి, రవి గారి విజన్ వేరు. వారి కిరీటంలో మరో మైలురాయి చేరినందుకు నా అభినందనలని తెలిపారు. దర్శకుడి విజయాన్ని గుర్తిస్తూ, తొలి సినిమా విజయం సాధించడం చాలా ప్రత్యేకం. రూ. 100 కోట్ల హిట్టు సాధించిన కీర్తిశ్వరన్‌ను అభినందిస్తున్నాను. సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ సినిమా చూడుతున్నంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యిందని ఆయన తెలిపారు. హీరోయిన్ మమిత బైజును గురించి, "అద్భుతంగా నటించారు. ఆమెకు ఇంకా ఎన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Details

స్టార్ హీరోలా ఎదగాలి

తెలుగు-తమిళ్ అనుబంధంపై మాట్లాడుతూ, ఎస్కేఎన్, "తెలుగు, తమిళ్ ఒకే స్టేట్ లాంటి అనుబంధం ఉంది. కమల్ హాసన్, రజినీకాంత్, సూర్య, అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి వంటి స్టార్‌లు వచ్చినా మేము మా సొంత సినిమాలా ప్రేమిస్తాం. ప్రదీప్ ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాడు. వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆయన హీరో, యాక్టర్, స్టార్ మెటీరియల్ అన్నీ కలిపి ఉన్నాడని, ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నానని ముగించారు.