Page Loader
Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస సినిమాలు.. ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
బాలకృష్ణతో వరుస సినిమాలు.. ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..

Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస సినిమాలు.. ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్‌' చిత్రంతో ప్రేక్షకులను అలరించి పెద్ద హిట్‌ను సాధించిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలో కావేరిగా తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్ర‌జ్ఞా జైస్వాల్‌ (Pragya Jaiswal). గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన 'అఖండ' కూడా సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ, బాలకృష్ణతో వరుసగా చేయబోయే సినిమాల గురించి ఆమె స్పందించారు. నటీనటుల మధ్య వయస్సు తేడా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

 'డాకు మహారాణి' అని పిలుస్తున్నారు

''నా పుట్టినరోజునే 'డాకు మహారాజ్‌' (Daaku Maharaj) విడుదలై విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం నాకు అద్భుతంగా ప్రారంభమయ్యిందని నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర అయిన కావేరి గురించి వస్తున్న స్పందనను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. 'డాకు మహారాజ్‌' విడుదలైన తర్వాత నుండి, అందరూ నన్ను 'డాకు మహారాణి' అని పిలుస్తున్నారు. కావేరి పాత్ర ఆ స్థాయిలో ప్రభావం చూపింది. ఒక నటిగా ఈ చిత్రం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. గర్భిణి పాత్రను పోషించడం నాకు కొత్త అనుభూతినిచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఈ పాత్ర ద్వారా మహిళల శక్తిని చూపించగలిగింది'' అని ఆమె చెప్పింది.

వివరాలు 

ఆయన ఒక లెజెండ్‌

ఇక బాలకృష్ణతో (Balakrishna) రెండు సినిమాల గురించి మాట్లాడుతూ.. ''ఆయన ఒక లెజెండ్‌. బాలకృష్ణ పేరు వినగానే 'పాజిటివిటి' అనే పదం గుర్తుకు వస్తుంది. ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఆయన మనసులో మాటను నేరుగా చెప్పగలిగే వ్యక్తి. అందరినీ సమానంగా గౌరవిస్తారు. ఆయన మంచి మనిషి. పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు, వారి వయస్సు ఆధారంగా కాదు. నాకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశానా లేకపోతే అని మాత్రమే ఆలోచిస్తాను. నా దృష్టిలో వయసు ఒక సమస్య కాదు. 'అఖండ' విడుదలైనప్పుడు, మా ఇద్దరినీ స్క్రీన్‌పై చూసి నేను ఆశ్చర్యపోయాను'' అని ప్రగ్యా జైస్వాల్‌ చెప్పారు.