Prakash Raj : మరోసారి 'ఫాదర్' పాత్రలో ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా ఇలానే ఒదిగిపోతాడు. విభిన్న పాత్రలతో ఎప్పటికప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న ప్రకాష్ రాజ్, ఇప్పటికీ తన నటనలో ప్రత్యేకతను చూపిస్తున్నాడు. తండ్రి పాత్రల్లో ప్రత్యేకత చూపించి ప్రేక్షకులకు నచ్చిన ప్రకాష్ రాజ్, తాజాగా మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నారు. కన్నడలో "ఫాదర్" అనే సినిమాతో మరో కొత్త టర్న్‌లో, నాన్నగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తండ్రి, కొడుకులుగా డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 'ఫాదర్' చిత్రంలో అతడికి జోడీగా లవ్ మాక్ టైల్ సిరీస్ సినిమాలతో గుర్తింపు పొందిన డార్లింగ్ కృష్ణ హీరోగా కనిపిస్తున్నారు. కబ్జా డైరెక్టర్ ఆర్ చంద్రు దర్శకత్వంలో, ఆర్ సి స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఒక తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలను అద్భుతంగా చూపించే సన్నివేశాలను ప్రతిబింబిస్తారని చిత్రబృందం తెలిపింది. సినిమాలోని మోషన్ పోస్టర్‌ను స్టార్ హీరో సుదీప్ లాంచ్ చేశారు. ఈ కొత్త పాత్ర ప్రకాష్ రాజ్ నటనలో మరో పెద్ద మైలురాయిగా నిలుస్తుందో లేదో కొంతకాలం వేచి ఉండాల్సిందే.