LOADING...
Prakash Raj: బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయను.. ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ పూర్తి.. 
బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయను.. ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ పూర్తి..

Prakash Raj: బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయను.. ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ పూర్తి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ దాదాపు ఐదు గంటల పాటు సాగింది. విచారణ సమయంలో ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన వివరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి నిర్వాహకుల నుంచి తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇకపై ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయను. ప్రజలు కూడా బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశను పెట్టుకోకూడదు." అని సూచించారు. తాను చెప్పిన వివరాలను ఈడీ అధికారులు రికార్డ్ చేశారని తెలిపారు. ఇంకా తనను తిరిగి విచారణకు పిలవలేదని వెల్లడించారు.

వివరాలు 

బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని కీలకఅంశాలు

ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని కీలకఅంశాలు వెలుగు చూసాయి. దుబాయ్‌ నుంచి ఆపరేట్ అవుతున్నబెట్టింగ్ యాప్‌లకు ప్రకాశ్‌రాజ్ ప్రచారం చేసినట్లు ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బును కొంతమంది సినీ ప్రముఖులు దుబాయ్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో గత ఐదేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను ఇప్పటికే ఈడీకి అందజేశానని ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. "జంగిల్ రమ్మీ"అనే యాప్‌ ద్వారా తాను మంచి ఆదాయం పొందినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఆయాప్‌తో తన కాంట్రాక్ట్ పూర్తయ్యాక మళ్లీ దీన్ని రెన్యూల్ చేయలేదని,ఇకపై ఎప్పుడూ ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయనని చెప్పారు.