Page Loader
NTRNeel : ఉప్పాడ బీచ్‌లో ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు ప్లాన్!

NTRNeel : ఉప్పాడ బీచ్‌లో ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా అని చెప్పగానే అంచనాలు భారీగా పెరిగాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించగా, మేకర్స్ చివరకు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫిబ్రవరి చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Details

హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ 

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో అల్లర్లు, రాస్తారోకో సన్నివేశాలను ప్రశాంత్ నీల్ షూట్ పూర్తి చేశారు. ఉప్పాడ బీచ్‌లో కీలక సీన్స్ ఇటీవల ప్రశాంత్ నీల్ కాకినాడ సమీజపంలోని ఉప్పాడ బీచ్, పరిసర ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఈ చిత్రానికి సంబంధించిన షిప్పింగ్, తీరప్రాంతానికి సంబంధించిన కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్‌ను పరిశీలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Details

 కోల్‌కతాలో సెకండ్ షెడ్యూల్ 

ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపథ్యంతో రూపొందుతుండగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం యూనిట్ కోల్‌కతా వెళ్ళనుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్చి 30న 'డ్రాగన్' షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.