Loading...
418 The Film: సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రశాంత్ నీల్ '418'.. సెప్టెంబర్ 18న విడుదల
సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రశాంత్ నీల్ '418'.. సెప్టెంబర్ 18న విడుదల

418 The Film: సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రశాంత్ నీల్ '418'.. సెప్టెంబర్ 18న విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టేందుకు '418' సిద్ధమైంది. అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న తొలి హర్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. కన్నడ దర్శకుడు కీర్తన్ నడగౌడ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. చాలాకాలంగా సెన్సార్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న '418'కు తాజాగా ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రాన్ని పరిశీలించి 'ఏ' సర్టిఫికేట్ మంజూరు చేసింది. దీంతో సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.

వివరాలు 

'418'తో నిజమైన భయాన్ని పరిచయం చేస్తామన్న మేకర్స్

భయానక సన్నివేశాలు, హర్రర్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాను రూపొందించినట్లు చిత్రబృందం చెబుతోంది.

ఇప్పటివరకు వచ్చిన హర్రర్ చిత్రాలను చూసి భయపడకుండా నవ్వుకున్న ప్రేక్షకులకు '418'తో నిజమైన భయాన్ని పరిచయం చేస్తామని మేకర్స్ అంటున్నారు.

సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా కథనం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాకు దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఆసక్తికరమైన, సంచలనాత్మక అంశాలతో రూపొందిన ఈ హర్రర్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT