LOADING...
Prashanth Varma : కుమారస్వామి కథతో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌.. డైరెక్టర్‌గా సముద్రఖని?
కుమారస్వామి కథతో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌.. డైరెక్టర్‌గా సముద్రఖని?

Prashanth Varma : కుమారస్వామి కథతో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌.. డైరెక్టర్‌గా సముద్రఖని?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథాంశాలపై ఆధారిత సినిమాలకు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్టార్ దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగా, దర్శకుడు తిరుమల కిశోర్ కూడా ఇదే నేపథ్యంతో కథను రూపొందించారు. తాజాగా ఈ జాబితాలోకి 'హను-మ్యాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా చేరారు. ప్రశాంత్ వర్మ ఇప్పటికే కుమారస్వామి కథాంశంతో ఒక అద్భుతమైన స్టోరీని సిద్ధం చేసి లాక్ చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి ఆయన స్వయంగా దర్శకత్వం వహించకుండా, కేవలం కథను అందిస్తూ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే బాధ్యతను విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రకనికి అప్పగించే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు సమాచారం.

వివరాలు

ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ

భక్తి, ఫాంటసీ అంశాలను సమర్థంగా మేళవించడంలో ప్రశాంత్ వర్మకు ఉన్న విజన్‌కు, సముద్రఖని మేకింగ్ స్టైల్ కలిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కుమారస్వామి కథలపై టాలీవుడ్ దర్శకుల మధ్య పెరుగుతున్న పోటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలతో గుర్తింపు పొందిన సముద్రఖని, దర్శకుడిగా కూడా 'శంభో శివ శంభో', 'బ్రో' సినిమాలతో మంచి పేరు సంపాదించారు. కుమారస్వామి కథాంశం కావడంతో ఈ సినిమాకు దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement