
Kothapallilo Okappudu: దర్శకురాలిగా మారిన ప్రవీణ పరుచూరి.. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు దర్శకురాలిగా మారారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు' (Kothapallilo Okappudu) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, పరుచూరి విజయ్ సమర్పణలో గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి సంయుక్తంగా పరుచూరి ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.
Details
మూవీపై సినీ ప్రముఖుల ఆసక్తి
ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూసినవారికి ఇది ఒక రూరల్ థ్రిల్లర్‌గా భావన కలుగుతుంది, అయితే ఇందులో హాస్యాన్ని సమపాళ్లలో నింపినట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాతో మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల వెండితెరపై పరిచయమవుతున్నారు. అలాగే రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీతో కలసిన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌పై ఇప్పటికే సినిమాప్రముఖులు ఆసక్తిగా ఉన్నారు. దర్శకురాలిగా ప్రవీణ పరుచూరి ఎలాంటి మార్క్ చూపించబోతున్నారో చూడాలంటే జూలై 18 వరకూ వేచి చూడాల్సిందే.