Page Loader
Naga Chaitanya: శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య 
శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య

Naga Chaitanya: శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ప్రముఖ నటుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో కొత్త జీవితాన్ని ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం ఆమెతో చాలా సంతోషంగా ఉన్నానని నాగ చైతన్య తెలిపారు. శోభితా తనను బాగా అర్థం చేసుకుందని, తన జీవితంలో ఉండే వెలితిని ఆమె నింపుతుందని చెప్పారు. తమ పెళ్లి సంప్రదాయబద్ధంగా, సింపుల్‌గా జరుగుతుందని, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి ప్రత్యేకమైన స్థలమని, అక్కడే పెళ్లి జరగనుందని పేర్కొన్నారు. తాతగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండేలా స్టూడియోలోని ఆయన విగ్రహం ఎదుట వేడుకను నిర్వహించనున్నామని నాగచైతన్య పేర్కొన్నారు.

Details

డిసెంబర్ 4న వివాహం

నాగచైతన్య-శోభితా వివాహం డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగనుంది. ఈ పెళ్లిపై నాగార్జున మాట్లాడారు. తాము కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సుమారు 300 మందిని ఆహ్వానిస్తామని, ఈ వేడుకను చాలా ప్రత్యేకంగా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 8న నాగ చైతన-శోభిత నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం నాగచైతన్య 'తండేల్‌' చిత్రంలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం అభిమానులందరికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.