LOADING...
Prithviraj: తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్
తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్

Prithviraj: తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ఐ, నోబడీ' తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 10న రానుంది. నిస్సాం బషీర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పార్వతి తిరువోతు కీలక పాత్రలో కనిపించనున్నారు. ముకేశ్‌ ఆర్‌. మెహతా, సుప్రియా మేనన్‌, సి.వి. సారథి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 9న విడుదల కానుంది. అనంతరం తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీస్రవంతి మూవీస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి జూలై 10న ఈ సినిమాను విడుదల చేయనున్నాయి.

వివరాలు

ఉత్కంఠభరితమైన కథనం, యాక్షన్‌ సీన్స్..

సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు జీవితంలో చోటుచేసుకునే ఊహించని పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఉత్కంఠభరితమైన కథనం, యాక్షన్‌ సన్నివేశాలు, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విడుదలకు ఒక రోజు ముందే, అంటే 9వ తేదీన ప్రత్యేక ప్రీమియర్‌ షోలను నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి సమీర్‌ అబ్దుల్‌ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, దినేశ్‌ పురుషోత్తమన్‌ ఛాయాగ్రహణం నిర్వహించారు. జేక్స్‌ బిజాయ్‌ సంగీతాన్ని సమకూర్చారు.

Advertisement