LOADING...
Supriya Menon: ఏడేళ్ల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ!
ఏడేళ్ల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ!

Supriya Menon: ఏడేళ్ల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా వేధింపులు ఈ రోజుల్లో సాధారణమే అయినా, సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఇవి మరింత తీవ్రంగా ఎదురవుతున్నాయి. తాజాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మేనన్ కూడా ఇలాంటి అనుభవాన్ని వ్యక్తీకరించారు. 2018నుండి ఓ మహిళ నన్ను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందంటూ చెప్పిన సుప్రియ, ఇప్పటివరకు తనపై వచ్చిన వ్యాఖ్యలు భరించలేక స్పందించాల్సి వచ్చిందని వివరించారు. ఆమె ఓ ఫోటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాలో ఏ ఫిల్టర్‌ కూడా ఆమె ద్వేషాన్ని కప్పిపుచ్చలేకపోతోందంటూ పేర్కొన్నారు. ఆ మహిళకు చిన్న పిల్లాడి ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు తాను సహనం పాటించానని, కానీ ఇప్పుడు ఆ ట్రోలర్‌ తన తండ్రిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తోందన్నారు.

Details

సుప్రియకు మద్దతుగా నెటిజన్లు

ఇది సహించలేని స్థాయికి చేరిందని తెలిపారు. "నా తండ్రి ఇక నా జీవితంలో లేరు.. అయినా కూడా ఆమె అతనిపై ఆరోపణలు చేస్తోంది. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఆమె ఖాతాను బ్లాక్‌ చేశాను. కానీ ఆమె నకిలీ ఖాతాలు సృష్టించి తిరిగి అదే విధంగా వేధింపులకు పాల్పడుతోంది. ఆమె పని నన్ను బాధ పెట్టడమే అయిందని చెప్పారు. తనపై ఉన్న ద్వేషంతో, ఆమె ప్రతిసారీ కొత్త అకౌంట్స్‌ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేస్తోందని, ఇప్పుడు వాటిని బ్లాక్ చేయడమే తన రోజు వారి పని అయిందని సుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుప్రియ తెలిపిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.