
Darling- Mallesam priyadarshi- Teaser Release: డార్లింగ్ గా మల్లేశం ప్రియదర్శి.. టీజర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి మల్లేశం (Mallesam)సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి (Priyadarshi)ఇప్పుడు కొత్త సినిమాతో ముందుకొస్తున్నాడు.
మల్లేశం సినిమా ప్రియదర్శికి మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత జబర్దస్త్ వేణు తీసిన బలగం (Balagam) సినిమాతో ప్రియదర్శికి మంచి మార్కెట్ ఏర్పడింది.
బలగం సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసపెట్టి ప్రియదర్శికి ఆఫర్లు వస్తున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేషా (Nabha Natesh) ప్రధాన పాత్రలో ప్రియదర్శి హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ ఎంటరై్టనర్ తెరకెక్కుతోంది.
గత రెండు రోజులుగా నభా నటేష్, ప్రియదర్శి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అందరికీ తెలిసిందే.
Details
టైటిల్ ను, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిస చిత్ర యూనిట్
ఇదంతా ఇప్పుడొస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అని తెలుస్తూనే ఉంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను, ఫస్ట్ గ్లింప్స్ ను ఫిల్మ్ యూనిట్ రిలీజ్ చేసింది.
తమిళ డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమాలో మురళీధర్ గౌడ్, అనన్య నాగళ్ల, కృష్ణతేజ, శివ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ చూస్తుంటే భార్యాభర్తలు ఫన్నీ గొడవలు పడి మళ్లీ కాంప్రమైజ్ అవడం లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సన్నివేశాలు బాగానే దట్టించినట్లున్నారు.
ఈ సినిమాకు ప్రభాస్ సూపర్ హిట్ మూవీ 'డార్లింగ్' (Darling) పేరునే ఖాయం చేశారు మేకర్స్