Priyanka chopra: ఇంట్లో నిక్ జోనాస్‌ను ప్రియాంక చోప్రా ఏ పేరుతో పిలుస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త, ప్రముఖ గాయకుడు-నటుడు నిక్ జోనాస్ మధ్య ఉన్న అనుబంధం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ దంపతులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సరదా విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంట్లో నిక్‌ను తాను ప్రేమగా 'బాబు' అని పిలుస్తానని ప్రియాంక వెల్లడించారు. ఈ ఆసక్తికర విషయం జోనాస్ బ్రదర్స్ నిర్వహిస్తున్న తాజా పోడ్‌కాస్ట్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ముద్దు పేరు, వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
వివరాలు
ఆ విషయాలను పంచుకున్న ప్రియాంక..
జోనాస్ బ్రదర్స్ కెవిన్, జో నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్‌లో ప్రియాంక, నిక్ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంట్లో భర్తను తాను 'బాబు' అని పిలుస్తానని ప్రియాంక చెప్పగా, ఆ పిలుపు వినగానే ఆమెకు ఏదో సహాయం కావాల్సి వచ్చిందని వెంటనే అర్థమవుతుందని నిక్ నవ్వుతూ వెల్లడించాడు.
ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ.. "నిక్ ఇంట్లో ఉన్నప్పుడు నా చేతులు పనిచేయనట్టే ఉంటుంది.
ఏ చిన్న పని ఉన్నా 'బాబు' అని పిలుస్తాను" అని సరదాగా చెప్పారు. దీనికి నిక్ స్పందిస్తూ.. "ఆమె 'బాబు' అని పిలిచిన వెంటనే నేను 'చెప్పు, ఏమైంది?' అని స్పందిస్తాను" అన్నారు.
వివరాలు
భర్తను ప్రశంసించిన హీరోయిన్..
అంతేకాకుండా, "బాబు... టీవీ రిమోట్ పనిచేయడం లేదు", "బాబు... ఇంటర్నెట్ కనెక్ట్ కావడం లేదు", "బాబు... ఒక డ్రింక్ తీసుకొస్తావా?" అంటూ ఇంట్లో తన భర్తతో ఎలా చిన్నచిన్న పనులు చేయించుకుంటానో ప్రియాంక నవ్వుతూ వివరించారు.
ఈ సంభాషణను విన్న కెవిన్, జో ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. అనంతరం "ప్రతి జంటకు వారి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది.
మీ ఇద్దరి కెమిస్ట్రీ చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది" అంటూ ప్రశంసించారు.
దీనికి స్పందించిన ప్రియాంక.. "అవును.. ఈ విషయంలో నేను నిజంగా అదృష్టవంతురాలిని. ఐ లవ్ యూ, నిక్" అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.
ఇదే పోడ్‌కాస్ట్‌లో మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలకు కూడా ఈ జంట సమాధానాలు ఇచ్చింది.