Loading...
Varanasi: మహేశ్, నిక్ జోనాస్‌తో ఏఎమ్‌బీలో ప్రియాంక సందడి.. ఆగస్టు 7న 'వారణాసి' బిగ్ అప్‌డేట్?
మహేశ్, నిక్ జోనాస్‌తో ఏఎమ్‌బీలో ప్రియాంక సందడి.. ఆగస్టు 7న 'వారణాసి' బిగ్ అప్‌డేట్?

Varanasi: మహేశ్, నిక్ జోనాస్‌తో ఏఎమ్‌బీలో ప్రియాంక సందడి.. ఆగస్టు 7న 'వారణాసి' బిగ్ అప్‌డేట్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌తో హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ సినీ హబ్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, షూటింగ్ నిమిత్తం ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. హైదరాబాద్‌లో కుటుంబంతో ప్రియాంక 'వారణాసి' షూటింగ్ షెడ్యూల్‌కు మధ్యలో చిన్న విరామం లభించడంతో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీతో కలిసి హైదరాబాద్‌లో సమయం గడుపుతున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ ఏఎమ్‌బీ సినిమాస్‌లో మహేశ్ బాబుతో కలిసి ప్రియాంక-నిక్ జంట మూవీ నైట్‌ను ఎంజాయ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది.

వివరాలు

ఏఎమ్‌బీ సినిమాస్‌లో స్టార్ సందడి

మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కలిసి దిగిన ఫొటోను AMB Cinemas యాజమాన్యం తమ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది.

ఆ పోస్ట్‌లో గ్లోబ్ ట్రోటర్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, 'దేశీ గర్ల్' మందాకిని ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది.

అంతేకాకుండా పోస్ట్‌లో '7' ఎమోజీని జోడించడం ఆసక్తిని రేకెత్తించింది. దీంతో 'వారణాసి' సినిమా నుంచి త్వరలోనే ఒక భారీ అప్‌డేట్ రానుందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా ఐవరీ కలర్ టాప్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించగా, మహేశ్ బాబు బ్లాక్ టీషర్ట్, క్యాప్‌తో క్యాజువల్ అవతార్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు.

వివరాలు

రాజమౌళి ఫోన్ చేయగానే వెంటనే ఒప్పుకున్నా

ఇటీవల 'జోనాస్ బ్రదర్స్ పాడ్‌కాస్ట్'లో పాల్గొన్న ప్రియాంక చోప్రా 'వారణాసి' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ చిత్రం కోసం గత 14 నెలలుగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఆమె, ఎస్.ఎస్. రాజమౌళి సర్ స్వయంగా నాకు ఫోన్ చేసి కథ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా, విభిన్న కాలాల్లో సాగే అద్భుతమైన అడ్వెంచర్ డ్రామా ఇది.

ఇందులో నా పాత్ర కోసం ఎన్నో స్లోమోషన్ యాక్షన్ సన్నివేశాలు, జంప్స్ చేశాను. రాజమౌళి ఫోన్ చేయగానే వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పానని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

'వారణాసి' కథ ఏంటి?

'వారణాసి' కథ 'శాంధవి' అనే భారీ ఉల్క భూమిని ఢీకొట్టిన తర్వాత సంభవించే వినాశనం, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో సాగుతుంది.

పోగొట్టుకున్న ఒక కాస్మిక్ అస్త్రం కోసం విభిన్న కాలాలు, ఖండాల మధ్య ప్రయాణించే 'రుద్ర' అనే శివభక్తుడి పాత్రలో మహేశ్ బాబు కనిపించనున్నారు.

ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో ఉండే విలన్ 'కుంభ' పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

పురాణ కాలపు రహస్యాలను ఛేదించే క్రమంలో రుద్రుడికి సహాయపడే 'మందాకిని' అనే కీలక పాత్రను ప్రియాంక చోప్రా పోషిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్

'వారణాసి' చిత్రాన్ని దాదాపు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT