LOADING...
Priyanka Mohan: ఇట్స్ ఆఫీసియల్ .. '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో ప్రియాంక మోహన్ ఎంట్రీ
ఇట్స్ ఆఫీసియల్ .. '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో ప్రియాంక మోహన్ ఎంట్రీ

Priyanka Mohan: ఇట్స్ ఆఫీసియల్ .. '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో ప్రియాంక మోహన్ ఎంట్రీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళం, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో వరుసగా నటిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక మోహన్... పవన్ కళ్యాణ్, నాని, ధనుష్, శివ‌కార్తికేయన్ వంటి టాప్ స్టార్‌లతో నటించి ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఎదుగుతోంది. ఇదిలా ఉండగా, ఆమె పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమా అప్‌డేట్ బయటకు వచ్చింది. డాక్టర్ శివ రాజ్ కుమార్, ధనంజయ కీలక పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ..

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. "శివ రాజ్ కుమార్ సర్ సినిమాలు చూసే వాతావరణంలోనే నేను పెరిగాను. ఇప్పుడు '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో భాగస్వామ్యం కావడం నా కోరిక నెరవేరినట్టే. మోస్ట్ టాలెంటెడ్ ధనంజయతో కలిసి నటించే అవకాశం రావడం, ఈ యూనిట్‌లో చేరడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు హేమంత్ ఎం. రావుతో కలిసి పని చేయడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది. ఇదిలా ఉంటే... భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలన్న ప్లాన్‌ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్