Varanasi: తెలుగు డైలాగ్స్ కోసం ప్రియాంక ప్రాక్టీస్.. బీటీఎస్ వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎడ్వెంచర్ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా హైప్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్‌ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో అద్భుతమైన వేడుకగా ప్రకటించారు. మహేష్ బాబు ఫస్ట్‌లుక్, గ్లింప్స్ విడుదలతో రాజమౌళి మరోసారి తన విభిన్నమైన సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హాజరయ్యాక మొత్తం వేదిక ఆకర్షణ ఆమె వైపే మళ్లింది. స్టేజ్‌పైకి వచ్చిన ప్రియాంక చోప్రా తెలుగులో హలో హైదరాబాద్, తగలబెట్టేద్దామా? అంటూ హాలోను పలకరించడంతో సభ మందిరం అంతా ఘోర హర్షధ్వనులతో మార్మోగింది.
Details
'మందాకిని' పాత్రలో ప్రియాంక చోప్రా
ఆమె చెప్పిన ఈ తెలుగుదనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియోను ఆమె స్వయంగా షేర్ చేయగా, ఆ డెడికేషన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "సినిమాలో మాట్లాడటం కంటే లైవ్ స్టేజ్‌పై తెలుగు మాట్లాడడం చాలా కష్టం" అంటూ ప్రియాంక చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 'వారణాసి' చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంకనే నటిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో ఆమె 'మందాకిని' పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేస్తోంది.
Details
మాస్ లుక్ వైరల్
గుహలో దేవతా విగ్రహాల మధ్య చీర కట్టుకుని గన్ పట్టుకుని కనిపించిన ఆమె మాస్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. టీజర్‌లోని చిన మస్తానా దేవి టెంపుల్ సీక్వెన్స్ ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. ప్రమాదంలో చిక్కుకున్న ప్రియాంకను మహేష్ కాపాడే విజువల్స్ థ్రిల్లింగ్‌గా ఆకట్టుకున్నాయి. చిన మస్తా దేవి హిందూ తాంత్రిక పూజల్లో రౌద్రరూప దేవతగా పూజింపబడుతుంది. ముఖ్యంగా టిబెటన్ తాంత్రిక సంప్రదాయాల్లో ఈ దేవికి విశేషమైన స్థానం ఉంది. చిన్న మస్తా, ప్రచండ చండిక, జోగని మా వంటి పేర్లతో పిలవబడే ఈ దేవి విగ్రహం చుట్టూ రూపొందించిన సన్నివేశాలు సినిమాలో కీలక మలుపులు కానున్నాయని తెలుస్తోంది.
Details
పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ప్రియాంక చోప్రా
రాజమౌళి ఈ శక్తివంతమైన పాత్రను ఎలా తీర్చిదిద్దారనే దానిపై భారీ ఆసక్తి నెలకొంది. ఆమె పాత్ర ఏ ప్రపంచంలో విస్తరించబోతోంది? కథలో ఆమె ప్రాధాన్యం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌కి తోడు ప్రియాంక చోప్రా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతుండటంతో 'వారణాసి'పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.