Page Loader
#Akhil 6 : టైటిల్ గ్లింప్స్ విడుదల సమయం రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ.. 
టైటిల్ గ్లింప్స్ విడుదల సమయం రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ..

#Akhil 6 : టైటిల్ గ్లింప్స్ విడుదల సమయం రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచి విజయం కోసం శ్రమిస్తున్నయువ హీరోలలో అక్కినేని అఖిల్ ఒకడు. సినీ వంశానికి చెందిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా,నటనలో టాలెంట్ ఉన్నప్పటికీ, అతని కెరీర్‌లో సరైన స్టార్‌డమ్ మాత్రం ఇంకా దక్కలేదు. కథల ఎంపిక విషయంలోనే పొరపాట్లు జరుగుతున్నాయా?లేక అభిమానులు అఖిల్ నుంచి మరో రకమైన ప్రదర్శన ఆశిస్తున్నారా? అనేది పక్కన పెట్టినప్పటికీ, తన తొమ్మిదేళ్ల సినీ ప్రయాణంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అఖిల్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత, 'వినరో భాగ్యము విష్ణు కథ'తో గుర్తింపు పొందిన దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరుతో అఖిల్ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో రూపొందనుండగా, ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.

వివరాలు 

#Akhil6' సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌

నందు తొలి సినిమా కూడా తిరుపతి పరిసరాల్లోనే తెరకెక్కిన నేపథ్యంలో, అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఈ చిత్రానికి అక్కడే క్లాప్ పడనుందని సమాచారం. తాజాగా, ఈ సినిమా గ్లింప్స్‌పై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను నిర్మాత నాగవంశీ ఇచ్చాడు. ఇటీవల సెలబ్రిటీల పుట్టినరోజున వారు నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ అప్‌డేట్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇదే నేపథ్యంలో, ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా '#Akhil6' సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో అఖిల్ చేయి మాత్రమే చూపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్