
గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడు ఉంటుందో వెల్లడి చేసిన నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుండి దసరా కానుకగా మొదటి పాట విడుదలవుతుందని ఊరిస్తూ వస్తున్నారు. అయితే పాట విడుదల ఎప్పుడు ఉంటుందనేది వెల్లడి కాలేదు.
తాజాగా నిర్మాత నాగవంశీ, గుంటూరు కారం మొదటి పాట విడుదలపై క్లారిటీ ఇచ్చారు. గుంటూరు కారం మొదటి పాట రికార్డింగ్ పూర్తయిందని నాగవంశీ అన్నారు.
దసరా రోజున లేదంటే దసరాకి రెండు మూడు రోజుల ముందు మొదటి పాట విడుదల గురించి అప్డేట్ అందిస్తామని, అప్డేట్ వచ్చిన తక్కువ సమయంలోనే పాట విడుదల ఉంటుందని ఒకానొక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నాగవంశీ మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
Details
ఇప్పటివరకు గ్లింప్స్ మాత్రమే విడుదల
గుంటూరు కారం సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యింది. ఈ గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఇంతకుముందు ఎన్నడూ కనిపించని మాస్ అవతారంలో మహేష్ బాబు కనిపించబోతున్నారని గ్లింప్స్ వీడియో ద్వారా అర్థమయింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.
తమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం సినిమాను 2024 జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, రమ్యకృష్ణ, మహేష్ ఆచంట కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుంటూరు కారం మొదటి పాటపై నిర్మాత నాగవంశీ మాటలు
Producer @vamsi84 About Guntur Kaaram First Single 🕺🕺🥳🥳🔥🔥#GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/YbQxmbkRQz
— Pandu Gadu 2.0 (@PanduGadu2_0) October 17, 2023