
Vijay Sethupathi : పూరి జగన్నాథ్ పుట్టినరోజు కానుక.. విజయ్ సేతుపతి చిత్రానికి ఖరారైన టైటిల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయ్‌తో చేసిన 'లైగర్'పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దీంతో విజయ్‌తో రాబోతున్న కొత్త చిత్రం ఆయన కెరీర్‌కు మళ్లీ హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 28న టైటిల్, టీజర్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు బిక్షాందేహి, మాలిక్, బెగ్గర్ వంటి టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా.. చివరకు 'స్లమ్‌డాగ్' అనే టైటిల్‌నే ఫైనల్ చేశారు.
Details
రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఈ టైటిల్ ద్వారా కథలోని పేదవాడి నుంచి ధనవంతుడిగా ఎదిగే ప్రయాణం లేదా జీవితంలో జరిగే భారీ మార్పు గురించి సంకేతం ఇస్తోంది. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా రేపు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. విజయ్ సేతుపతితో పాటు సంయుక్తా, టబు, విజయ్, బ్రహ్మాజీ, వీ టీవీ గణేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జెబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.