Loading...
Puri Jagannadh : డిప్రెషన్‌ కూడా జీవితానికి పాఠాలే నేర్పుతుంది: పూరి జగన్నాథ్
డిప్రెషన్‌ కూడా జీవితానికి పాఠాలే నేర్పుతుంది: పూరి జగన్నాథ్

Puri Jagannadh : డిప్రెషన్‌ కూడా జీవితానికి పాఠాలే నేర్పుతుంది: పూరి జగన్నాథ్

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన 'పూరి మ్యూజింగ్స్‌'లో భాగంగా ఈసారి డిప్రెషన్‌ గురించి ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకున్నారు. సాధారణంగా డిప్రెషన్‌ను ప్రతికూలంగా చూస్తామని, కానీ కొన్ని సందర్భాల్లో అది మనిషికి జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఇస్తుందని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్లుగా, డిప్రెషన్‌ మన జీవిత వేగాన్ని కొంత తగ్గిస్తుంది. ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉండే జీవనశైలిలో ఈ విరామం కొన్నిసార్లు అవసరమవుతుంది. ఈ సమయంలో చాలామంది ఇతరుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తారు. ఒంటరిగా గడిపే క్షణాల్లో మన జీవితం, అలవాట్లు, సంబంధాలు, తీసుకుంటున్న నిర్ణయాల గురించి మనమే మనల్ని ప్రశ్నించుకోవడం మొదలవుతుంది.

వివరాలు

డిప్రెషన్‌ను జయించండిలా..

అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి తన తప్పులను కూడా నిజాయతీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

గతంలో ఎవరికైనా కఠినంగా మాట్లాడి ఉంటే అది గుర్తుకు వస్తుంది. కొందరితో మరింత మంచిగా ప్రవర్తించాల్సిందని అనిపిస్తుంది.

తాను ఎందుకు వెనుకబడుతున్నాడు? ఎక్కడ తప్పు జరుగుతోంది? అనే విషయాలపై స్పష్టత రావడం మొదలవుతుంది.

అంతేకాక, ఇంతకు ముందు చాలా పెద్దగా అనిపించిన సమస్యలు వాస్తవానికి అంత ముఖ్యమైనవి కావని కూడా అర్థమవుతుంది.

డిప్రెషన్‌ను అనుభవించిన వ్యక్తులు ఇతరుల బాధను కూడా బాగా అర్థం చేసుకోగలరని పూరి తెలిపారు.

వారి మనసులో సహానుభూతి పెరుగుతుందని, దాంతో సంబంధాలు కూడా మరింత మెరుగుపడతాయని అన్నారు.

వివరాలు

గొప్ప సందేశం ఇచ్చిన పూరీ..

అయితే డిప్రెషన్‌ను పూర్తిగా మంచిదిగా భావించడం సరైంది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది నిద్రపై ప్రభావం చూపుతుందని, పనితీరు తగ్గించే ప్రమాదం ఉందని అన్నారు.

బాధ ఒక పరిమితిలో ఉంటే అది మనిషిని ఆలోచింపజేస్తుంది కానీ అధికంగా పెరిగితే హానికరంగా మారుతుందని చెప్పారు.

అందుకే భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమని సూచించారు.

ఈ సందర్భంగా కొన్ని ప్రముఖుల జీవితాలను కూడా ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

చిన్నప్పటి పేదరికం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న జిమ్ క్యారీ తర్వాత తన బాధను హాస్యంగా మార్చుకుని ప్రపంచాన్ని నవ్వించిన నటుడిగా ఎదిగాడని చెప్పారు.

తిరస్కరణలతో బాధపడిన లేడీ గాగా తన భావోద్వేగాలను సంగీతంలో కలిపి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు.

ADVERTISEMENT