LOADING...
Puri-Sethupathi:ఐదు నెలల్లో 'పూరి సేతుపతి' మూవీ కంప్లీట్.. టీమ్ నుండి స్పెషల్ వీడియో!
ఐదు నెలల్లో 'పూరి సేతుపతి' మూవీ కంప్లీట్.. టీమ్ నుండి స్పెషల్ వీడియో!

Puri-Sethupathi:ఐదు నెలల్లో 'పూరి సేతుపతి' మూవీ కంప్లీట్.. టీమ్ నుండి స్పెషల్ వీడియో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ సేతుపతి-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ పూర్తయింది. '#PuriSethupathi' పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ గురించి టీమ్‌ అధికారికంగా అప్‌డేట్‌ ఇచ్చింది. 'ఎన్నో నెలల ప్రయాణం... భావోద్వేగాలూ, ఆనంద క్షణాలతో నిండిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. త్వరలో వరుస అప్‌డేట్స్ వస్తాయి... రెడీగా ఉండండంటూ ఒక ఫన్నీ వీడియోను నిర్మాణసంస్థ విడుదల చేసింది. పూరీ జగన్నాథ్‌తో పని చేసిన అనుభవాన్ని చెప్పుకుంటూ 'అయనను మిస్ అవుతాననని విజయ్‌ సేతుపతి వ్యాఖ్యానించారు.

Details

కథనాయికగా సంయుక్త

జూలై మొదట్లో మొదలైన ఈ సినిమా షూటింగ్‌ కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటించగా, టబు, విజయ్‌కుమార్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా వినూత్నమైన కథతో సినిమా తెరకెక్కుతోంది. ముఖ్యంగా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో ఇంతకుముందు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'బెగ్గర్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.