
Puri-Vijay : 'బెగ్గర్' టైటిల్ పై విజయ్ సేతుపతి క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుంది.
పాన్ ఇండియా స్థాయిలో అనేకభాషల్లో రూపొందే ఈచిత్రాన్ని పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈసినిమా తెలుగుతో పాటు తమిళం,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈసినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఇందులో నటించబోయే ప్రధాన పాత్రల వివరాలను పూరి జగన్నాథ్ ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాడు.
ప్రముఖ నటి టబు ఓ కీలక పాత్రలో కనిపించనుండగా,నటుడు విజయ్ కుమార్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నాడు.
ఈనేపథ్యంలో ఈ సినిమాకు 'బెగ్గర్' అనే టైటిల్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
వివరాలు
సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు
ఇటీవల జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి ఈ విషయంపై స్పందించారు.
ఆయన మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్ గారి పనితీరును నేను ఎంతో గౌరవిస్తాను. ఆయన తీసిన ప్రతి సినిమాను నేను చూశాను. ఆయన నన్ను స్క్రిప్ట్ వినిపించాలనగా, అది రెండు మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. కానీ గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు. షూటింగ్ జూన్‌లో మొదలవుతుంది. ప్రేక్షకులకంటే ఎక్కువగా నేనే ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇక టైటిల్ విషయానికొస్తే - ఇప్పటికీ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు. 'బెగ్గర్' అని మీరు నిశ్చయించేసారా?'' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.