LOADING...
Dhurandhar : 'పుష్ప 2' రికార్డుకు బ్రేక్.. 'ధురంధర్'తో నెట్‌ఫ్లిక్స్‌ బారీ ఒప్పదం
'పుష్ప 2' రికార్డుకు బ్రేక్.. 'ధురంధర్'తో నెట్‌ఫ్లిక్స్‌ బారీ ఒప్పదం

Dhurandhar : 'పుష్ప 2' రికార్డుకు బ్రేక్.. 'ధురంధర్'తో నెట్‌ఫ్లిక్స్‌ బారీ ఒప్పదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా, 'ఉరి' ఫేమ్‌ ఆదిత్య ధార్‌ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ధురంధర్' (Dhurandhar) ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సంచలనంగా మారింది. థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ రంగంలోనూ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా రూ.285 కోట్ల వరకు చెల్లించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఈ మొత్తం ఇటీవల 'పుష్ప 2'కు కుదిరిన ఓటీటీ డీల్‌ (దాదాపు రూ.275 కోట్లు) కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Details

రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్

థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత, అంటే 2026 జనవరి 30న లేదా ఫిబ్రవరి తొలి వారంలో 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉండటంతో, ఈ భారీ డీల్‌ రెండు భాగాలకు కలిపి జరిగిందా? లేక కేవలం మొదటి భాగానికే ఈ మొత్తాన్ని చెల్లించారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్‌ 5న విడుదలైన 'ధురంధర్' ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను సాధించింది.

Details

రూ.వెయ్యి కోట్లకు చేరే అవకాశం

ఫుల్‌ రన్‌ ముగిసేలోపు ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక 'ధురంధర్: రివెంజ్' పేరుతో రూపొందుతున్న పార్ట్‌ 2 వచ్చే ఏడాది మార్చి 19, 2026న విడుదల కానుంది.

Advertisement