Page Loader
Pushpa 2: 'పుష్ప 2' ఫైనల్‌ షాట్‌.. ఐదేళ్ల ప్రయాణం ముగిసిందంటూ సుకుమార్ ట్వీట్!
'పుష్ప 2' ఫైనల్‌ షాట్‌.. ఐదేళ్ల ప్రయాణం ముగిసిందంటూ సుకుమార్ ట్వీట్!

Pushpa 2: 'పుష్ప 2' ఫైనల్‌ షాట్‌.. ఐదేళ్ల ప్రయాణం ముగిసిందంటూ సుకుమార్ ట్వీట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2: ది రూల్' తో ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. . 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో, పుష్ప 2 టీం కొత్త అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. పుష్ప 2 షూటింగ్‌ చివరి షాట్‌ పూర్తియైనట్లు సుకుమార్ టీం అంగీకరిచింది. 'పుష్ప' ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తయైందని, దర్శకుడు సుకుమార్ తన అధికారిక ట్విట్టర్‌లో ఫోటో షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Details

వైజాగ్ లో భారీ కటౌట్

'పుష్ప 2: ది రూల్' మరింత భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు మ్యూజికల్ హిట్‌ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌ నగరంలో ఉన్న సంగం శరత్‌ థియేటర్‌లో 16×108 అడుగుల భారీ అల్లు అర్జున్‌ కటౌట్‌ను ఏర్పాటుచేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇది ఏపీ చరిత్రలో అత్యంత పెద్ద కటౌట్‌గా నిలవనుంది. రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫహద్‌ ఫాసిల్, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు.