Page Loader
Allu arjun: భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'పుష్ప-2' రికార్డు
భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'పుష్ప-2' రికార్డు

Allu arjun: భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'పుష్ప-2' రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2024
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప 2 చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అల్లు అర్జున్‌కు ఉన్న అంతర్జాతీయ అభిమానులతో పాటుగా, 'పుష్ప 2' విడుదలకు సంబంధించి సందడి మరింత పెరిగింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. ఆరు భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి, భారతదేశంలో 6,500 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 5,000 స్క్రీన్స్ కేటాయించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత స్థాయిలో విడుదల కాలేదు.

Details

అంచనాలను పెంచేస్తున్న పుష్ప 2

ఈ భారీ విడుదలతో 'పుష్ప 2' భారతీయ సినిమాగా బిగ్గెస్ట్‌ రిలీజ్‌గా రికార్డు సృష్టించనున్నది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఈ చిత్రం కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులను సాధించనుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా మేకర్స్ పంచుకున్న ఆసక్తికర విషయాలతో ఈ చిత్రం మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.