Page Loader
Pushpa 2: బుక్‌ మై షోలో 'పుష్ప2' సంచలనం.. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ బుకింగ్!
బుక్‌ మై షోలో 'పుష్ప2' సంచలనం.. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ బుకింగ్!

Pushpa 2: బుక్‌ మై షోలో 'పుష్ప2' సంచలనం.. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ బుకింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 03, 2024
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప: ది రూల్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా బుక్‌ మై షోలో టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే, టికెట్ల అమ్మకాలు ఊహించని రీతిలో అమ్ముడుపోయాయి. దీంతో, 'పుష్ప 2' చిత్రం ఒక కొత్త రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ టికెట్లు అమ్ముడైన చిత్రంగా రికార్డుకెక్కింది.

Details

24 గంటల్లో లక్ష టికెట్స్ బుకింగ్స్

ఇది కేవలం బుక్‌ మై షో ద్వారా మాత్రమే జరిగింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా ప్రీ-సేల్ బుకింగ్స్‌ భారీగా జరిగాయి. తాజాగా హిందీ వెర్షన్‌ టికెట్లు ఓపెన్ చేయగా 24 గంటల్లోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ చిత్రం బాలీవుడ్‌లో ఆల్‌టైమ్‌ టాప్‌ చిత్రాల లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో, 80 దేశాలలో, 6 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.