
Pushpa 2 TV Premier: బుల్లితెరపై దుమ్మురేపేందుకు పుష్ప -2 సిద్ధం.. టెలికాస్ట్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' కలెక్షన్ల పరంగా రికార్డులను తిరగరాసింది.
గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు 'పుష్ప 2' టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది.
Details
జాతర మొదలైంది..!
స్టార్ మా ఛానల్ ఏప్రిల్ 1న పుష్ప 2 టెలికాస్ట్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది.
ఈ చిత్రంలోని జాతర సీన్‌లోని అల్లు అర్జున్ చేతిని చూపించే పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'గంగమ్మ తల్లి జాతర మొదలు' అని క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో త్వరలోనే ఈ బ్లాక్‌బస్టర్ మూవీ బుల్లితెరపై సందడి చేయనుందని స్పష్టమైంది.
అయితే టెలికాస్ట్ డేట్, టైమ్ విషయమై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Details
ఏప్రిల్ 13న టెలికాస్ట్..?
పుష్ప 2 సినిమా ఏప్రిల్ 13న స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
థియేటర్స్, ఓటీటీలో భారీ విజయాన్ని సాధించిన ఈ మాస్ యాక్షన్ మూవీ టీవీ టీఆర్పీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంచనాలు నెలకొన్నాయి.
ఓటీటీలోనూ రికార్డులు
పుష్ప 2 మూవీ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై భారీ స్థాయిలో ట్రెండ్ అయ్యింది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ గ్లోబల్ రేంజ్‌లోనూ భారీగా ట్రెండ్ అయింది.
ఇప్పటికీ ఇండియా ట్రెండింగ్ టాప్-10లో స్థానం దక్కించుకుంది.
Details
పుష్ప 2 కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానానికి చేరుకుంది.
హిందీలో రూ.800 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
బాక్సాఫీస్‌పై సంచలనం సృష్టించిన ఈ మూవీ టీవీ టీఆర్పీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.