తదుపరి వార్తా కథనం

pushpa 2: ఓటీటీలోకి 'పుష్ప2 '.. అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 27, 2025
01:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2 OTT Release) ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలకు సిద్ధమైంది.
అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా, రీలోడెడ్ వెర్షన్‌తో డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
జనవరి 30 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.
బాక్సాఫీస్ వద్ద రూ.1896 కోట్ల వసూళ్లను అందుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఇప్పుడు ఓటీటీలోనూ కొత్త రికార్డులు నెలకొల్పుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.