Page Loader
Pushpa 2: పుష్ప 2' పీలింగ్స్‌ లిరికల్‌ వీడియో.. అల్లు అర్జున్‌- రష్మిక డ్యాన్స్‌ కి ఫ్యాన్స్ ఫిదా  

Pushpa 2: పుష్ప 2' పీలింగ్స్‌ లిరికల్‌ వీడియో.. అల్లు అర్జున్‌- రష్మిక డ్యాన్స్‌ కి ఫ్యాన్స్ ఫిదా  

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన 'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని 'సూసేసి' 'కిస్సిక్‌' పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, మూడవ పాట 'పీలింగ్స్‌' విడుదలైంది. ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ గీతం మలయాళం లిరిక్స్‌తో ప్రారంభమవుతోంది. మలయాళ ప్రేక్షకులపై తన ప్రేమను చాటుకునే ఉద్దేశ్యంతో, ఈ గీతాన్ని ప్రత్యేకంగా రూపొందించామని స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఈ పాట పుష్ప 2‌పై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఈ సరికొత్త పాటను ఆస్వాదించండి!