NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2 Pre Release Business: రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన పుష్ప-2
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2 Pre Release Business: రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన పుష్ప-2
    రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన పుష్ప-2

    Pushpa 2 Pre Release Business: రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన పుష్ప-2

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 22, 2024
    12:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2021 డిసెంబర్‌లో విడుదలైన సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప-1' చిత్రం, అల్లు అర్జున్ హీరోగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

    ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప 2' (Pushpa 2: The Rule) డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి, ఈ అంచనాలకు అనుగుణంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

    ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది.

    వివరాలు 

    వరల్డ్‌వైడ్‌గా రూ.640 కోట్ల థియేట్రికల్ బిజినెస్

    తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో పుష్ప-2 థియేట్రికల్ బిజినెస్ రూ.220 కోట్లు, తమిళనాడులో రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.200 కోట్లు, అలాగే ఓవర్సీస్‌లో రూ.120 కోట్లు బిజినెస్ చేసింది.

    మొత్తం మీద వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.640 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

    బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవాలంటే, ఈ చిత్రం దాదాపు రూ.1300 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.

    వివరాలు 

    థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి మొత్తం రూ.1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇక నాన్-థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకు సొంతం చేసుకుంది.

    మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లకు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లకు అమ్ముడయ్యాయి.

    థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి మొత్తం రూ.1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.

    ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన చిత్రం ఇదే.

    'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేయకపోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్
    Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు! హైదరాబాద్
    New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! కార్

    పుష్ప 2

    అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  అల్లు అర్జున్
    అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి  అల్లు అర్జున్
    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం  అల్లు అర్జున్
    రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి  రష్మిక మందన్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025